లగ్జరీ బంగ్లాల కొండ… నల్లగండ్ల

  • ఐటీ కారిడార్, ఓఆర్ఆర్ కు చేరువలో ఉండటంతో పెరిగిన డిమాండ్
  • ఏటేటా పెరుగుతున్న నిర్మాణాలు, లగ్జరీ అపార్టుమెంట్లు

హైదరాబాద్,వెలుగు :

హైదరాబాద్ రియల్ వ్యాపారానికి హాట్ సెంటర్ నల్లగండ్ల. ఐటీ కంపెనీలు, లగ్జరీ బంగ్లాలకు కేరాఫ్.  వెస్ట్ సిటీలో ఉన్న గచ్చిబౌలి, మౌకిలా, రాయదుర్గం, మాదాపూర్, హైటెక్ సిటీకి అతి చేరువలో ఉండటం, పరిసర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్, పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తుండటం… చుట్టూ ఇంటర్నేషనల్​ స్కూళ్లు, ఆధునిక హాస్పిటళ్లు, లింగంపల్లి ఎంఎంటీఎస్​కు దగ్గరగా ఉండే నల్లగండ్లలో హై రైజ్ అపార్టుమెంట్లతో  విపరీతమైన డిమాండ్ పెరిగింది.

రెసిడెన్షియల్ సెగ్మెంట్ కు కేరాఫ్

గచ్చిబౌలికి చేరువలో, బీహెచ్ఈఎల్ కు దగ్గరగా విస్తరించి ఉన్న నల్లగండ్ల.. ఓల్డ్ ముంబై హైవేకు సమీపంలోనే ఉంది. ఈ ప్రాంతం రెసిడెన్షియల్ సెగ్మెంట్ కు కేరాఫ్ గా ఉంది. సిటీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఇదొకటి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి రెవెన్యూ మండలంలో ఉన్న ఈ ప్రాంతం ఐటీ కారిడార్ కు సమీపంలో ఉండటంతో రియల్ వ్యాపారానికి హాట్ కేకులా మారింది. మెట్రో వంటి ఆధునిక రవాణా వసతులు లేకపోయినా.. ఎంఎంటీఎస్, మెరుగైన రోడ్డు ఫెసిలిటీ ఉండటంతో… ఇక్కడ నుంచి సిటీలో ఎక్కడికైనా త్వరగా చేరుకునే వీలుంది. తెల్లాపూర్, హఫీజ్ పేట్, చందానగర్, రాయదుర్గం, మాదాపూర్ వంటి ప్రాంతాలు కూడా నల్లగండ్లకు దగ్గరగా ఉండటంతో ఎక్కువగా ఐటీ, బీహెచ్ఈఎల్ ఉద్యోగులు ఇక్కడ నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇళ్ల అమ్మకానికే కాదు.. రెంట్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది.

రియల్ మార్కెట్ తీరు…

రెండేళ్లుగా ఐటీ కంపెనీలు విస్తరిస్తుండటం.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాలతోపాటు నల్లగండ్లలో రియల్ వ్యాపారం జోరుగా ఉంది. నల్లగుండ్ల చుట్టూ బడ్జెట్ అపార్టుమెంట్లు, లగ్జరీ విల్లాలే కాకుండా ప్రీమియం ఫ్లాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతంలో నివాసం ఉండేందుకు ఎక్కువగా లగ్జరీ విల్లా ప్రాజెక్టులను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతారు. దీంతోపాటు హై రైజ్, గేటెడ్ కమ్యూనిటీ అపార్టుమెంట్లకు పదుల సంఖ్యలో అందుబాటులో ఉండగా… 50కిపైనే నిర్మాణదశలో ఉన్నాయి. దీంతోపాటు మరిన్ని కంపెనీలు ఈ పరిసరాల్లోకి రానుండగా… రెసిడెన్షియల్ స్పేస్ కు భారీ డిమాండ్ ఉంది.

శాటిలైట్ టౌన్ షిప్పులతో మారనున్న తీరు..

వాక్ టు వర్క్ కాన్సెప్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ విస్తరించిన 158 కి.మీ మేర ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపుల దాదాపు 360 కి.మీ.ల పరిధిలో గ్రోత్ కారిడార్ ను ఆధునిక వసతులతో, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని శాటిలైట్ టౌన్ షిప్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఓఆర్ఆర్ వెంబడి 13 ప్రాంతాల్లో ఈ టౌన్ షిప్పులు రానుండగా.. తెల్లాపూర్ పరిసరాల్లో ఒక్క ప్రాజెక్టును ఆవిష్కరించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టౌన్ షిప్ నిర్మాణ పనులు మొదలుపెడితే, హైదరాబాద్ రియల్ రంగానికి మరింత ఊపు ఇచ్చినట్లు అవుతుంది. దీంతోపాటు ఐటీ కారిడార్ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చి రియల్ ఇన్వెస్ట్ మెంట్లు పెరిగేందుకు స్కోప్ ఉంది.

Nallagandla is Care of for IT Companies and Luxury Bungalows

Latest Updates