అమెరికాలో రోడ్‌యాక్సిడెంట్: ‘నల్లకుంట’ సాహిత్‌రెడ్డి మృతి

అమెరికాలో ఎమ్మెస్ చేస్తున్న హైదరాబాదులోని నల్లకుంటకు చెందిన సాహిత్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4 గంటలకు వాకింగ్ కు వెళ్లిన సాహిత్ రెడ్డిని.. వెనక నుండి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాహిత్ రెడ్డి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. కారు ఢీ కొట్టిన వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

కారు దాడిలో గాయపడిన వ్యక్తి ఎవరు అని పోలీసులు తెలుసుకోవడానికే నాలుగు గంటల టైమ్ పట్టింది. అక్కడ కన్సల్టెన్సీని సంప్రదించి… సమాచారాన్ని  హైదరాబాద్ లోని అతడి తల్లిదండ్రులకు చెప్పారు పోలీసులు.

సాహిత్ రెడ్డి ఆగస్టు 15, 2016లో న్యూజెర్సీకి ఎమ్మెస్ చేయడానికి వెళ్లాడు. ఉద్యోగం వచ్చే సమయానికి చనిపోయాడని.. కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆవేదనతో చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించి చివరి చూపులు చూసుకోవడానికి అయినా మృతదేహాన్ని తొందరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని బంధువులు కోరుతున్నారు.

Latest Updates