పార్లమెంట్ సమావేశాలకు సహకరిస్తాం

ఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా ఏర్పాటుచేసిన
అఖిలపక్ష సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ లోక‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ఎంపీలందరూ సహకరించాలని ప్రధాని కోరినట్లు ఆయన తెలిపారు. పార్లమెంటు సమావేశాలకు తమ పార్టీ ఎంపీలందరం సహకరిస్తామని ఆయన అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలలో 27 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపిందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు లోక్‌సభ మరియు రాజ్యసభలో తమ ఎంపీలందరికీ అవకాశం ఇవ్వాలని అడినట్లు ఆయన తెలిపారు. ఆర్ధిక మందగమనం, కాలుష్యం, నిరుద్యోగం, రైతు సమస్యలపై చర్చించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు చర్చించడానికి అవకాశం ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహకారం అందించాలని టీఆర్ఎస్ లోక‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు.

Latest Updates