టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావు

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరారు. ఈ ఉదయం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశమైన నామా నాగేశ్వరరావు పార్టీలో చేరికపై చర్చించారు. ఆ తర్వాత ఆయనకు టీఆర్ఎస్ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు కేటీఆర్.

నామా నాగేశ్వరరావును ఖమ్మం నుంచి టీఆర్ఎస్ ఎంపీగా పోటీలో నిలబెడతారని ప్రచారం జరుగుతోంది.

2014 లోక్ సభ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు ఓడిపోయారు. కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా ఇక్కనుంచి పోటీచేసిన నామా… వైసీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఓటమి పాలయ్యారు. మారిన పరిస్థితుల్లో ఆయన టీఆర్ఎస్ లో చేరారు.

షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కూడా నామా నాగేశ్వరరావుతో పాటు టీఆర్ఎస్ లో చేరారు.

Latest Updates