రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాల‌నే టీఆర్ఎస్‌లో చేరా: నామా

Nama talks about joining in TRS

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, సంక్షేమ ప‌థ‌కాలు చూసే టీఆర్ఎస్‌లో చేరాన‌ని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిన తర్వాత తొలిసారి ఆయ‌న ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నదే తన కోరిక అని, అందుకే ఈసారి పార్టీ త‌ర‌పున ఎంపీగా పోటీచేయ‌బోతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ మాట్లాడుతూ ఖ‌మ్మం ఎంపీగా నామాను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా అందిస్తామని అన్నారు.

Latest Updates