నమోటీవీ వివరాలు కోరిన ఈసీ

న్యూఢిల్లీ: ‘నమోటీవీ’తో పాటు ‘కంటెట్ టీవీ’ పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖను కేంద్ర ఎన్ని కల సంఘం అదేశించింది. పలు డీటీహెచ్, కేబుల్ ప్లాట్ ఫాంలో నిరంతరం ప్రధాని ప్రసంగాలతో పాటు పలువురు  బీజేపీ అగ్ర నేతల ఇంటర్ప్యూలను ప్రసారం చేస్తున్న ఈ ఛానళ్ల పూర్తి వివరాలు అందిం చాలని ఆదేశించింది. లోక్ సభ ఎన్నికలకు ముందు మోడీ పొటో ను ‘లోగో’గా పెట్టుకొని లాంఛ్ అయిన ఈ రెండు ఛానళ్ల ప్రసారాలు కోడ్ ఉల్లం ఘన కిందకు వస్తుందో  రాదో తెలపాలని ఈసీని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కోరాయి. ఎన్ని కలకు ముందు ఈ రకంగా ఛానళ్లు పెట్టుకునేందుకు ఈసీ అనుమతి అవసరమా? ఒకవేళ అవసరం అయితే ఈసీ అనుమతి ఇచ్చిందా ? ఈసీ  అనుమతి తీసుకోకుండా నే ఈఛానళ్లు లాంఛ్ అయితే  ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో తెలపాలంటూ  ఫిర్యాదు చేశాయి. మరోవైపు కేంద్రం దూరదర్శన్ ను దుర్వి నియోగం చేస్తోందని కాంగ్రెస్ మరో ఫిర్యాదు చేసింది. ‘మై బి చౌకీదార్’ కార్యక్రమానికి దూరదర్శన్ లో ఎక్కు వ ప్రాధాన్యం ఇస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.

Latest Updates