రేప్ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్ లో 2015లో జరిగిన రేప్ కేసుకు సంబంధించి ఈ రోజు నాంపల్లి కోర్టు సంచలన తీర్పు చెప్పింది. నిందితులిద్దరికి 23 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ముషిరాబాద్ కు చెందిన మహ్మద్ ఉస్మాన్, పియూష్ జైన్ లు 2015లో ఓ యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. అప్పట్లో ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. ఘటనకు పాల్పడ్డ నిందితులు మహ్మద్ ఉస్మాన్, పియూష్ జైన్ లను ముషీరాబాద్ పోలీసులు అప్పట్లోనే అరెస్ట్ చేశారు. అయితే సంఘటన జరిగిన సంవత్సరం తర్వాత భాదితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. దాంతో ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అప్పటి ఐవో ఇన్ స్పెక్టర్ మోహన్ కుమార్ పక్కా ఆధారాలతో కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆయన బదిలీపై వెళ్లగా.. ప్రస్తుత ఇన్ స్పెక్టర్ మురళీక్రిష్ణ కేసును సీరియస్ గా పాల్ అప్ చేశారు. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత.. కోర్టు నిందితలు నేరం చేసినట్లుగా నిర్ధారించింది. దాంతో నిందితులకు 23 సంవత్సరాల జైలు శిక్షతోపాటు 55 వేల రూపాయల జరిమాన విధిస్తున్నట్లు తెలిపింది. కేసును విజయవంతంగా ముగించినందుకు ముషీరాబాద్ పోలీసులను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అభినందించారు.

For More News..

వీడియో: ఇద్దరు నర్సులకు కరోనా.. పట్టించుకోని వరంగల్ ఎంజీఎం

దిల్ సుఖ్ నగర్ సెల్ఫ్ లాక్ డౌన్

వీడియో: పదేళ్ల క్రితం.. ప్రస్తుతం సూర్యుడు ఎలా ఉన్నాడంటే..