హోంగార్డుపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

డ్యూటీలో ఉన్న హోంగార్డుపై దాడి చేసిన వ్యక్తిని నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.నాంపల్లి  సిఐ ఖాలీల్ పాషా తెలిపిన వివరాల ప్రకారం … ఆదివారం గాంధీ భవన్ రోడ్ లోని తాజ్ ఐలాండ్ వద్ద హోంగార్డు జకీర్ హుసైన్  విధులు నిర్వహిస్తుండగా.. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్న ఓ వ్యక్తిని గమనించి కెమెరాతో ఫోటో తీశాడు. అది గమనించిన ఆ బైకర్ హోంగార్డుపై  ఇటుకతో దాడి చేసి , అక్కడి నుండి పరారయ్యాడు. హోంగార్డుకు ఎడమచేతికి గాయం అయ్యి , రక్తస్రావం కావడంతో ఆ వ్యక్తి పై హోంగార్డు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి బండి నంబర్ (TS11EG7818) ఆధారంగా అతని గురించి తెలసుకున్న పోలీసులు.. అతను మంగల్ హాట్ కు చెందిన సతీష్ గా గుర్తించారు. సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Latest Updates