మహేశ్ చేతిలో ఓడిపోయిన నమ్రత

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు లాక్ డౌన్ టైమ్ లో ఫ్యామిలీతో కలసి ఇంటి వద్దే ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోస్ ను ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పిల్లలు సితార, గౌతమ్ తో మహేశ్ ఆడుకుంటున్న సరదా ఫొటోలను కూడా ఆమె షేర్ చేస్తుంటారు. తాజాగా మహేశ్ తో తాను ఆడిన ఫన్నీ గేమ్ వీడియోను నమ్రత ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో నమ్రత–మహేశ్ కలసి ‘బ్లింక్ అండ్ యూ లాస్’ గేమ్ ఆడుతూ కనిపించారు. గేమ్ లో భాగంగా మహేశ్, నమ్రత ఒకరినొకరు కను రెప్పలు ఆర్పకుండా తదేకంగా చూడాలి. ఎవరు ముందు కళ్లను బ్లింక్ చేస్తే వారు ఓడిపోయినట్లే.

గేమ్ మొదలైన కొన్ని సెకన్లకే నమ్రత నవ్వడంతో ఆమె ఆటలో ఓడిపోయింది. మామూలుగా తాను ఈ గేమ్ బాగా ఆడతానని, అయితే మహేశ్ పై మాత్రం గెలవలేకపోయానని నమ్రత క్యాప్షన్ జత చేసి పోస్ట్ చేసింది. గురువారం మహేశ్ ఫిట్ నెస్ కు సంబంధించిన ఓ వీడియోను నమ్రత ట్విట్టర్ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరుతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రిన్స్.. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురాం డైరెక్షన్ లో తదుపరి సినిమా చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలోనే వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.

View this post on Instagram

The Lion’s den !! #stayhomestaysafe

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

 

Latest Updates