బాలయ్య కొత్త మూవీ డైరెక్షన్ అనిల్ రావిపూడి కే

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న బాలయ్య.. తన నెక్స్ట్ మూవీ అనిల్ రావిపూడి డైరెక్షన్‌ లో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన సినిమాల్లో మాస్‌ ప్రేక్షకులు ఆశించే పవర్‌ ఫుల్ యాక్షన్, పంచ్‌ డైలాగ్స్‌‌‌‌కి బాలకృష్ణ ఎంత ప్రయారిటీ ఇస్తారో.. అంతే ఇంపార్టెన్స్ ఎంటర్‌ టైన్మెంట్‌ కి కూడా ఇస్తారనడంలో సందేహం లేదు. అందుకే అతనికి బాలయ్య చాన్స్ ఇచ్చారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోం ది. మంచి కామెడీ ఎంటర్‌ టైనర్స్‌‌‌‌తో వరుస విజయాలు అందుకుంటున్న అనిల్, తన కెరీర్‌ స్టార్టిం గ్ నుండి బాలకృష్ణతో సినిమా చేయాలని ఆశ పడుతున్నాడు. ‘రామారావు గారు’ టైటిల్‌‌‌‌తో ఈ సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. అయితే అనిల్ ఇతర ప్రాజెక్టులపై వర్క్ చేస్తుండడంతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతోం ది. ఇప్పుడు కూడా ‘ఎఫ్‌ 3’ చేయాలనుకున్నాడు. కానీ వెంకటేష్, వరుణ్ తేజ్‌ ల కమిట్‌ మెంట్స్‌‌‌‌ వల్ల దాన్ని వెనక్కి జరిపి, బాలకృష్ణ సినిమాని ముందుకు తెస్తున్నట్టుగా సమాచారం. దిల్‌‌‌‌రాజు కూడా బాలకృష్ణ ప్రాజెక్ట్‌‌‌‌పై ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక బాలకృష్ణ నెక్స్ట్ మూవీకి సంబంధించి బి.గోపాల్ లాం టి సీనియర్స్ ఇప్పటికే క్యూలో ఉన్నారు. రీసెంట్‌ గా ప్రవీణ్ సత్తారు పేరు కూడా యాడ్ అయ్యింది. దీంతో బాలకృష్ణ వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Latest Updates