‘రూలర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

నందమూరి బాలకృష కొత్త సినిమా ‘రూలర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 14న వైజాగ్ ఎంజీఎం గ్రౌండ్స్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌లో చిత్ర యూనిట్‌తో పాటు ప‌లువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 20న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అవుతుంది.

ఈ సినిమాలో రెండు డిఫ్రంట్ గెటప్స్ లో  బాల‌కృష్ణ కనిపించనున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, లిరిక‌ల్ వీడియో సాంగ్‌కు ఆయన అభిమానులతో పాటు ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌ల లిరిక‌ల్ వీడియోల‌ను చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు చినంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ సరసన వేదిక – సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Nandamuri Balakrishha's new movie Ruler a pre-release event locks date

Latest Updates