‘యూనిఫామ్ తీసానా..  ఆగను… ఇక వేటే’

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న రూలర్ టీజర్ గురువారం విడుదలైంది. రెండు డిఫ్రెంట్ లుక్స్ తో బాలయ్య టీజర్ లో మెరుపులు మెరిపించాడు. యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా ఇప్పటికే స్టైలిష్ గెటప్ తో సినిమా ఫస్ట్ లుక్ లో అదరగొట్టిన బాలయ్య .. టీజర్ లో తనదైన శైలిలో రెచ్చిపోయాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో మాస్ లుక్ లో అదిరిపోయాడు.

“ఒంటి మీద ఖాకి యూనిఫామ్ ఉంటెనే బోనులో పెట్టిన సింహం లా ఉంటాను …. యూనిఫామ్ తీసానా బయటికి వచ్చిన సింహంలా  ఆగను…..  ఇక వేటే” అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో ప్రకాష్ రాజ్,  భూమిక, జయసుధ నటిస్తున్నారు. ‘జై సింహా’ కాంబినేషన్‌లోనే వస్తున్న సినిమా కాబట్టి అభిమానుల్లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

Latest Updates