Breathe OTT: అప్పుడు ట్రోల్స్.. ఇప్పుడు వ్యూస్.. బ్రీత్ మూవీకి OTTలో సూపర్ రెస్పాన్స్

Breathe OTT: అప్పుడు ట్రోల్స్.. ఇప్పుడు వ్యూస్.. బ్రీత్ మూవీకి OTTలో సూపర్ రెస్పాన్స్

నందమూరి చైతన్య కృష్ణ(Nandamuri Chaitanya krishna) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రీత్(Breathe). దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ(Vamshikrishna Akella) తెరకెక్కించిన ఈ మెడికో థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 20 సంవత్సరాల తరువాత చైతన్య కృష్ణ హీరోగా చేసిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఎంతలా అంటే ఈ సినిమా కోసం ఆన్లైన్ లో ఒక్క టికెట్ కూడా బుక్ అవలేదు. ముందు నుండి సినిమాపై బజ్ లేకపోవడం, ప్రమోషన్స్ కూడా అంతగా చేయకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాభవాన్ని చవిచూసింది ఈ మూవీ. దీంతో ఈ సినిమాపై తీవ్రమైన ట్రోలింగ్ నడిచింది.

అందుకే బ్రీత్ సినిమా రిలీజై రెండు నెలల గడిచినా ఓటీటీ హక్కులపై  కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎట్టకేలకు ఆహా సంస్థ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఇటీవల శివరాత్రి కానుకగా మార్చ్ 8న బ్రీత్ సినిమాను స్ట్రీమింగ్ చేశారు. అయితే ఈ డిజాస్టర్ సినిమాను ఎవరు చూస్తారు అని సోషల్ మీడియాలో టాక్ నడిచింది. కానీ, అనూహ్యంగా ఓటీటీలో ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. దానికి కారణం ఈ సినిమాపై జరిగిన ట్రోలింగ్. 

నిజానికి ముందు బ్రీత్ సినిమా గురించి చాలా మందికి అస్సలు తెలియదు. కానీ, సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల ఈ సినిమా చాలా వైరల్ అయ్యింది. దీంతో అసలు ఈ సినిమాలో అంత ట్రోల్ అయ్యేంతలా ఏముంది అని తెలుసుకోవడానికి చూస్తున్నారు ఆడియన్స్. దీంతో ఈ సినిమాకు అదిరిపోయే వ్యూస్ వస్తున్నాయి. అలా ఓటీటీలో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం పరవాలేదు అనిపిస్తోంది.