కరోనా ఎఫెక్ట్..  నాని, రానా సినిమాల విడుదల వాయిదా

కరోనా భయం టాలీవుడ్ ని కూడా వణికిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 83 కరోనా కేసులు నమోదు కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయపడిపోతున్నారు. వీకెండ్స్ లో రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్, థియేటర్స్ జనాలు లేక వెలవెలబోతున్నాయి. ఈ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో థియేటర్లు ఇప్పటికే బంద్ అవ్వగా.. రెండు రాష్ట్రాల్లోనూ థియేటర్లు మూసివేతపై ఫిల్మ్ నగర్ లో తెలుగు చిత్ర నిర్మాతల మండలి సమావేశమై చర్చిస్తున్నారు. మరోవైపు ఈ ఉగాదికి విడుదల కావాల్సిన నేచురల్ స్టార్ నాని సినిమా ‘వి’ విడుదల వాయిదా పడింది. రానా ‘అరణ్య’ కూడా వాయిదా పడింది. అనుష్క ‘నిశ్శబ్ధం’ కూడా వాయిదా పడే అవకాశమున్నట్లు సమాచారం.

Latest Updates