ఐదుగురు ఆడవాళ్లు- వాళ్లతో ఒకడు.. ‘గ్యాంగ్ లీడర్’ ట్రైలర్ రిలీజ్

nani-gang-leader-movie-trailer-released

విలక్షణ సినిమాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా గ్యాంగ్ లీడర్. ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ సినిమాలో విలన్ గా నటించాడు. టీజర్ తోనే ఆకట్టుకుంది ఈ మూవీ. తాజాగా.. నాని-గ్యాంగ్ లీడర్ ట్రైలర్ విడుదలైంది.

థ్రిల్లర్ కథలు రాసే ఓ రైటర్ జీవితంలో ఐదుగురు ఆడవాళ్లు ప్రవేశించాక ఏం జరుగుతుందనేది ఉత్కంఠ కలిగించేలా తీశామన్నారు మూవీ మేకర్స్. థ్రిల్లర్, సైకో కిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉంటుందని చెప్పారు. ఫన్, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు హైలైట్ గా ఈ మూవీ వస్తోందని ట్రైలర్ ను బట్టి అర్థమవుతుంది.

నాని, కార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, ప్రణ్య, సత్య మెయిన్ రోల్స్ పోషించారు.

నాని-గ్యాంగ్ లీడర్ కు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ విడుదల కాబోతోంది.

అఖిల్ ‘హలో’ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని ఈ మూవీతో వస్తున్నాడు దర్శకుడు విక్రమ్ కె కుమార్. జెర్సీ హిట్ తర్వాత వస్తున్న నాని సినిమా కావడంతో.. గ్యాంగ్ లీడర్ పై మంచి అంచనాలు ఉన్నాయి.

Latest Updates