యూఎస్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ గెలుచుకున్న ఒసాకా

యూఎస్ ఓపెన్ 2020 ఫైనల్లో జపాన్‌కు చెందిన నవోమి ఒసాకా ఉమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. దాంతో నవోమి ఖాతాలో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ చేరింది. ఆర్థర్ ఆషే స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో అజరెంకాపై 1-6, 6-3, 6-3 తేడాతో విజయం సాధించింది. ఒసాకా గతంలో 2018 యూఎస్ ఓపెన్ మరియు 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లను గెలుచుకుంది. దాంతో మూడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు గెలుచుకున్న తొలి ఆసియా క్రీడాకారిణిగా ఒసాకా రికార్డుకెక్కింది. గతంలో ఈ రికార్డు చైనాకు చెందిన లీ నా పేరు మీద ఉంది.

జపనీస్ మరియు హైటియన్ వారసత్వానికి చెందిన ఒసాకా.. కోర్టులోకి తమీర్ రైస్ పేరుతో ఓ మాస్కును ధరించి అడుగుపెట్టింది. 2014లో ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో తమీర్ రైస్ అనే 12 ఏళ్ల ఆఫ్రికన్-అమెరికన్ బాలుడిని అమెరికన్ పోలీసు అధికారి కాల్చి చంపాడు. ఆ బాలుడి గుర్తుగా ఒసాకా ఈ మాస్కును ధరించింది. జాత్యాంహకార దాడికి మరియు పోలీసు క్రూరత్వానికి గురైన వారి గుర్తుగా.. టోర్నమెంట్ యొక్క ప్రతి రౌండ్లో వివిధ మాస్కులు ధరిస్తూ తన ఆటను ప్రదర్శించింది. బ్రయోనా టేలర్, ఎలిజా మెక్‌క్లైన్, అహ్మద్ అర్బరీ, ట్రాయ్వాన్ మార్టిన్, జార్జ్ ఫ్లాయిడ్ మరియు ఫిలాండో కాస్టిలే పేర్లను కలిగి ఉన్న మాస్కులను ఒసాకా ధరించింది.

For More News..

దేశంలో 47 లక్షలు దాటిన కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 2,216 కరోనా పాజిటివ్ కేసులు

క్రెడిట్ కార్డులపై ఫీజుల మోత.. రికవరీ కోసమేనంటున్న బ్యాంకులు

Latest Updates