రాజధాని రగడ.. అమరావతిలో లోకేశ్ బైక్ ర్యాలీ

రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా ఏపీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.  రాజధానిగా  అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. మంగళగిరి జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. పాత మంగళగిరి సీతారామ ఆలయం నుంచి….. పాత బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు… ర్యాలీలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తోపాటు.. టీడీపీ, జనసేన కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

Latest Updates