రావాలి సీబీఐ..కావాలి సీబీఐ..జగన్ పై లోకేష్ సెటైర్లు

ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్  చేసిన వైసీపీ పెద్దలు అధికారంలోకి వచ్చాక మౌనంగా ఎందుకు ఉన్నారో అంటూ జగన్ పై ట్విట్టర్లో ప్రశ్నలు వేశారు. సీబీఐకి కేసు అప్పగిస్తే నిజాలు బయటపడి జీవితాంతం శుక్రవారం కోర్టుకి వెళ్లాల్సివస్తుందని భయమా? అంటూ ఎద్దేవా చేశారు లోకేష్. కోడి కత్తి కేసు వెనుక మహాకుట్ర ఉందన్నారు. హత్య కేసులో అనుమానితుల ఆత్మహత్యల వెనుక రహస్యం ఏంటని ప్రశ్నించారు.

Latest Updates