వీడియో : జగన్ మాస్క్ పెట్టుకోరు.. పెట్టుకుంటే ఊరుకోరు..

సీఎం జగన్ పై నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. రాష్ట్రంలో లక్షల్లో కరోనా కేసులు,వేల సంఖ్యలో ప్రజల చనిపోతుంటే.. జగన్  మూర్ఖత్వానికి మానవ రూపంగానే మిగిలిపోయారన్నారు. ఆయన మాస్క్ పెట్టుకోరు, వేరే వాళ్ళు పెట్టుకుంటే ఊరుకోరన్నారు. మరి దళిత యువకుడు కిరణ్ ని మాస్క్ పెట్టుకోలేదని కొట్టిచంపడం ఎందుకు? అని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ లో కిరణ్ ని చంపింది మాస్క్ వేసుకోలేదనా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా?అని అన్నారు లోకేష్.

టీటీడీ పర్యటనలో  రేణిగుంట ఎయిర్ పోర్టులో జగన్ తో ఫోటో కోసం ఇద్దరు వ్యక్తులు మాస్క్ పెట్టుకుని  వచ్చినపుడు మాస్క్ తీసేయాలని జగన్  చెప్పిన వీడియోను లోకేష్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

కంగనాకు నోటీసులు ఎందుకివ్వలే.?..ఎన్సీబీపై నగ్మా ఫైర్

దేశంలో 57 లక్షలు దాటిన కరోనా కేసులు

Latest Updates