వాహ్ సీఎం జగన్ ..అందుకే ఏ-1 కాగలిగారు : నారా లోకేష్

ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారంలో జగన్ అనే నేను అంటూ ఇచ్చిన మాటలు కోటలు దాటాయని..పనులు మాత్రం గడపకూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు టీడీపీ అండగా నిలిచిందన్నారు.  6.49లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు  రూ.336 కోట్లు ఇచ్చేందుకు సిద్దపడ్డామని, వైసీపీ వేసిన కోర్ట్ కేసుల కారణంగా ఇవ్వలేకపోయామన్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వస్తే ఆరునెలల్లోపే రూ.1100 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రూ.264 కోట్లు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు.  తాము ఇస్తామన్న రూ.336 కోట్లలో జగన్ రూ.264 కోట్లు ఇచ్చి రూ.72కోట్లను మిగుల్చుకున్నారని అన్నారు. ఇంత మాయ చేశారు కాబట్టే జగన్ ఏ -1 కాగలిగారని లోకేష్ వ్యాఖ్యానించారు.

Latest Updates