“అయ్యా, తుగ్లక్ సీఎం గారూ “.. జగన్ పై లోకేశ్ సెటైర్లు

పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన రివర్స్ టెండర్ల విషయమై సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ట్విటర్ వేదికగా జగన్ పై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు.

“అయ్యా, తుగ్లక్ ముఖ్యమంత్రి గారూ ఎడమకాలు విరిగితే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కట్టు కట్టించినట్టుంది మీ తెలివి.పోలవరంలో తగ్గించి, ఎలక్ట్రిక్ బస్సుల్లో పదింతలు పెంచిన లాజిక్, రివర్స్ టెండర్ వెనకున్న అసలైన మేజిక్కని సామాన్యప్రజలకూ అర్థమైంది.” అని ఆరోపించారు

పోలవరంలాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టును, కేవలం స్వప్రయోజనాల కోసం ఎటువంటి అనుభవంలేని కంపెనీకి  అప్పగించడం ప్రాజెక్టు ఉనికికే ప్రమాదమని లోకేశ్ అభిప్రాయపడ్డారు. రివర్స్ టెండరింగ్ లో భాగంగా ప్రాజెక్టుపైకి చైనా “మేఘా“లు కమ్ముకొస్తున్నాయని అన్నారు.

“ప్రకాశం బ్యారేజీ గేటుకడ్డంగా బోటు పడితే తీయడానికి మీకు వారం పట్టింది. గోదావరిలో మునిగిన బోటును రెండువారాలుగా తీయలేక, 144 సెక్షన్ పెట్టారు.70 శాతం అయిన పోలవరం 30 శాతం పూర్తి చేస్తామని సవాల్ విసురుతున్న మంత్రిగారికి అలవాటైన విద్యేమో? పోలవరంపైనా బెట్టింగ్ కాద్దామంటున్నారు”  అని లోకేశ్ విమర్శించారు.

Nara Lokesh satires on CM Jagan on Polavaram project reverse tendering issue

Latest Updates