క్వార్టర్ బాటిల్ అమ్మకం తగ్గిందా..? నారా లోకేష్

ఏపీసీఎం జగన్ పై నారా లోకేష్ మండిపడ్డారు. జగన్  మద్యం దుకాణాల్లో రేటు పెంచి వైసీపీ మార్క్ దోపిడీని యధావిధిగా కొనసాగిస్తున్నారని అన్నారు . మద్య పాన నిషేధంపై ట్వీట్ చేసిన లోకేష్..ఇంత జరుగుతున్నా షాపులు తగ్గించాం, బార్లు తగ్గించడానికి శ్రమిస్తున్నాం అంటూ ఉపన్యాసాలు ఇస్తున్న ముఖ్యమంత్రి.. గతంలో కంటే ఒక్క క్వార్టర్ బాటిల్ అమ్మకం తగ్గించారా అని ప్రశ్నించారు.

ఇంగ్లీష్ మీడియంపై నారాలోకేష్ సెటైర్లు

పనిలో పనిగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఇంగ్లీష్ మీడియంపై నారాలోకేష్ సెటైర్లు వేశారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అనడానికి  జగన్ గొప్ప ఉదాహరణ అని అన్నారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుకోసం ఆరాటపడ్డారట. అధికారంలోకి రాగానే ఇంగ్లీష్ మీడియం కోసం పోరాటంచేస్తున్నారట.  మీ జిమ్మిక్స్ చూస్తుంటే ఏదోరోజు దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కూడా మహామేత అనేలా ఉన్నారని లోకేష్ ట్వీట్ చేశారు.

Latest Updates