చంద్రబాబు చెప్పడం వల్లే కలాం రాష్ట్రపతి అయ్యారు : లోకేష్

భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ అబ్దుల్ కలాం 88వ జయంతి వేడుకలు గుంటూరు జిల్లాలో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన కలాం జయంతి వేడుకల్లో మాజీ మంత్రి నారాలోకేష్ పాల్గొన్నారు. కలాం దేశానికి చేసిన సేవల్ని కొనియాడారు.

2012లో కలాంను రాష్ట్రపతిని చేసింది తన తండ్రి చంద్రబాబేనని లోకేష్ ఈ సందర్భంగా చెప్పారు. భారత రాష్ట్రపతిగా ఆనాడు ఎవరిని నియమించాలని చర్చ జరిగినప్పుడు చంద్రబాబు.. కలాం పేరును ప్రతిపాదించారని గుర్తుచేశారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేందుకు కలాం గారు సిద్ధంగా ఉంటారా అని, బీజేపీ మాజీ ప్రధాని అటల్ బీహరీ వాజ్ పేయి… చంద్రబాబును అడిగారన్నారు. ‘మీరు  నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటాను’ అని చంద్రబాబు.. వాజ్ పేయితో చెప్పారని అన్నారు లోకేశ్. ఆ తరువాత చంద్రబాబు.. కలాంకు ఫోన్ చేసి మీరు రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాలి… మీలాంటి వారు దేశానికి రాష్ట్రపతి అయితే అభివృద్ధి సాధించవచ్చు అని చంద్రబాబు చెప్పడంతో.. కలాం అంగీకరించినట్టు చెప్పారు నారాలోకేష్.

నిజానికి 2002, జులై 25న కలాం రాష్ట్రపతిగా పదవీ స్వీకారం చేశారు. 2012లో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా వ్యవహరించారు. లోకేశ్ మళ్లీ దొరికిపోయారంటూ సోషల్ మీడియాలో ఆయనపై సెటైర్లు ఊపందుకున్నాయి.

Latest Updates