జగన్ కు కౌంటరిచ్చిన లోకేశ్

గురువారం ఏపీ అసెంబ్లీలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య ఘాటైన సంభాషణ జరిగింది.కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు అప్పటి సీఎం గా ఉన్న ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అని సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి నారా లోకేశ్  ట్విటర్ లో స్పందిస్తూ.. కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా ? అని సీఎం జగన్ గారు ఎంతో సంస్కారవంతమైన భాషలో ఈ రోజు అసెంబ్లీలో అడిగారు. కాళేశ్వరంపై చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం అన్ని పత్రికల్లో వచ్చింది. ఇలాంటివి చూసే సమయం మీకు ఉండి ఉండదు.ఎందుకంటే.. ఆ టైంలో తమరు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారేమో అని లోకేశ్ ట్విటర్ లో పోస్ట్ చేశారు.

Latest Updates