రావాలి జగన్ కావాలి జగన్ అని..జైలు పిలుస్తుంది

ఏపీలో జరిగిన ఐటీదాడులను టీడీపీకి ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలను  తప్పుబట్టారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. పచ్చకామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని విమర్శించారు లోకేశ్. దేశంలోని పలు ప్రాంతాల్లో 40 చోట్ల సోదాలు నిర్వహిస్తే 85 లక్షలు దొరికాయని ఐటీ శాఖ అంటుంటే చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో 2 వేల కోట్లు దొరికాయని తప్పుడు ప్రచారం చేస్తూ వైసీపీ నాయకులు శునకానందం పొందుతున్నారన్నారు. ఇన్ఫ్రా కంపెనీల్లో అక్రమాలు జరిగినట్టు తేలితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటారన్నారు. రావాలి జగన్ కావాలి జగన్ అని.. జైలు పిలుస్తుందన్న భయం జగన్ ని వెంటాడుతుందన్నారు. అందుకే ఇన్ఫ్రా కంపెనీల్లో జరిగిన ఐటీ రైడ్స్ కి టిడిపికి ముడి పెట్టాలని తెగ ప్రయత్నిస్తుందన్నారు.

SEE MORE NEWS

మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన AR రెహ్మాన్

దారుణం.. పెళ్లి పీటలెక్కాల్సిన యువతి ఆత్మహత్య

Latest Updates