ఫ్యామిలీతో వచ్చేసిన “నారప్ప”

వైవిధ్యభరితమైన సినిమాలు తీయడంలో విక్టరీ వెంకటేష్ స్టైలే వేరు అనే విషయం అందరికీ తెలిసిందే. లేటెస్ట్ గా వెంకీ నారప్పగా మరోసారి సాహసం చేస్తుండగా.. ఈ మూవీకి సంబంధించిన పిక్ ను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. సంక్రాంతి సందర్భంగా గురువారం పోస్టర్ రిలీజ్ చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉన్న నారప్ప ఫ్యామిలీ ఫొటోను విడుదల చేసిన యూనిట్.. ఈ మూవీని వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.

వెంకటేష్ భార్య పాత్రలో ప్రియమణి, కొడుకుగా కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం నటిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న `అసురన్` సినిమాను సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకుడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కలైపులి ఎస్ థాను, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Latest Updates