కరోనా వల్ల ‘నారప్ప’ ఆపక తప్పలేదు!

కరోనా అందరినీ చాలా కష్టపెడుతోంది. సినిమా వాళ్లనైతే ముప్పు తిప్పలు పెడుతోంది. ముందుగానే ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ అన్నింటినీ
డిస్టర్బ్‌ చేసి, అందరూ ఇళ్లలోనే ఉండేట్లు చేసింది. కరోనా ఎఫెక్ట్ ఎక్కువ కావడంతో షూటింగులన్నీ బంద్ చేసిన సంగతి తెలిసిందే. అయితే
కొందరు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ షెడ్యూల్స్ కంటిన్యూ చేశారు. ‘నారప్ప’ టీమ్ కూడా అదే చేసింది. ఉన్నట్టుండి అన్నీ ఆపేస్తే.. షూటింగ్స్‌
మీదే డిపెండ్ అయ్యి జీవించే వారు ఇబ్బం ది పడతారని హీరో వెంకటేష్‌ ఆలోచించారట. దాంతో ఆ టీమ్ వర్క్ కంటిన్యూ చేసింది. కానీ అంతకంతకూ సమస్య పెరుగుతున్న క్రమంలో షూటింగ్ నిలిపి వేయడమే మంచిదని డిసైడ్ చేసు కుని ప్యాకప్ చెప్పేశారు.

వెంకటేష్ హైదరాబాద్ తిరిగొచ్చేశారు. శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో ఆయన మాస్క్‌‌తో కనిపించిన దృశ్యాలు నెట్‌‌లో వైరల్ అయ్యా యి. ‘అసురన్‌‌’కి రీమేక్‌‌గా శ్రీకాంత్‌‌ అడ్డాల దర్శకత్వం లో రూపొందుతున్న ఈ మూవీని వేసవికల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది టీమ్. దాంతో దాదాపు యాభై రోజుల లాంగ్ షెడ్యూల్‌‌ను ప్లాన్ చేశారట. దాన్ని ఎలాగైనా కంప్లీట్ చేద్దా మనుకున్నా రట కానీ కరోనా వల్ల ఆపక తప్పలేదన్నమాట. పరిస్థితి చక్కబడగానే మళ్లీ పని మొదలుపెడతామని, వీలైనంత త్వరగా అన్ని కార్యక్రమాలూ పూర్తి చేస్తామని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించిం ది.

Latest Updates