ఆస్తుల్లో బ్రిటన్ క్వీన్‌‌ను దాటిన ఇన్ఫోసిస్ నారాయణ కూతురు

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూతురు అక్షతా ఆస్తుల విలువ బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 కంటే ఎక్కువగా తేలింది. దీంతో అక్షత భర్త రిషి సునక్‌‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్షత వ్యాపార లావాదేవీలను రహస్యంగా ఉంచారంటూ సునక్ మీద విమర్శలు వస్తున్నాయి. యూకేలో ప్రభుత్వ మంత్రులు తమ కుటుంబీకుల ఆస్తుల వివరాలను తెలపాల్సి ఉంటుంది. తెలిసిన సమాచారం ప్రకారం.. తన తండ్రికి చెందిన ఇన్ఫోసిస్ కంపెనీలో అక్షతా పేరిట 480 మిలియన్‌‌ల బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ (జీబీపీ) షేర్లు ఉన్నాయి. భారత కరెన్సీలో వీటి విలువ దాదాపుగా రూ.4,200 కోట్లు. రాణి ఎలిజబెత్ వ్యక్తిగత ఆస్తుల విలువ జీబీపీ 350 మిలియన్లు. మన కరెన్సీలో సుమారుగా రూ.3,400 కోట్లు. అక్షత ఆస్తుల వివరాలను తెలపాల్సిన బాథ్యత సునక్‌‌దే. కానీ ఆయన వాటిని వెల్లడించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Latest Updates