గుండెపోటుతో మరణించిన నారాయణ స్టూడెంట్

సంగారెడ్డి : 17 ఏళ్లకే యువతి గుండెపోటుతో మరణించిన ఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో జరిగింది. తెల్లాపూర్‌, వెలిమల గ్రామానికి చెందిన కీర్తన(17) నారాయణ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. గురువారం మధ్నాహ్నం కీర్తన  క్లాస్ రూమ్ లో సడెన్ గా స్పృహతప్పి పడిపోయింది. వెంటనే విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించిన కాలేజీ యాజమాన్యం..కీర్తనను స్థానిక ప్రైవేటు హస్పిటల్ కి తరలించారు.

అక్కడ చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. కీర్తన మరణానికి హార్ట్ ఎటాక్ అని డాక్టర్లు చెప్పారు. దీంతో కాలేజీ ఒత్తిడితోనే తమ బిడ్డ చనిపోయిందంటూ కీర్తన తండ్రి లింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates