బాలికలపై నారాయణ వైస్ ప్రిన్సిపాల్ వేధింపులు.. అరెస్టు

చదువు చెప్పాల్సిన గురువు.. తన చండాలపు బుద్ధులు చూపించాడు. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడి కటకలాలపాలయ్యాడు. హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో జరిగిందీ ఘటన.

విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేదిస్తున్న హైదరాబాద్‌లోని మదీనాగూడ నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భువనగిరికి చెందిన ముఖేశ్ మదీనగూడ నారాయణ ఐఐటీ క్యాంపస్‌లో వైస్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. పిల్లలకు సరిగా పాఠాలు చెప్పిల్సిన పని వదిలేసి.. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు ముఖేశ్. దీంతో విసుగు చెందిన బాలికలు శుక్రవారం ధర్నాకు దిగారు. ఈ విషయం తెలియడంతో మియాపూర్ పోలీసులు మదీనాగూడలోని నారాయణ కాలేజీకి వెళ్లారు. వైస్ ప్రిన్సిపాల్‌పై యాక్షన్ తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.

కానీ అప్పటికే ముఖేశ్ క్యాంపస్ నుంచి పరారయ్యాడు.అతడిపై పోలీసులు పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేసి.. గాలింపు చేపట్టారు. మంగళవారం నాడు ముకేశ్‌ను  పోలీసులు అరెస్ట్ చేశారు.

 

Latest Updates