40ఎకరాల చెరువును కబ్జా చేసిన మాజీ సర్పంచ్…

నారాయణపేట జిల్లాలో ఏకంగా చెరువునే దిగమింగాలని చూశారు కొందరు కబ్జాదారులు. నర్వ మండలం లంకాల గ్రామంలో 450ఎకరాలకు స్థానిక ఉర్వ చెరువు సాగునీరు అందిస్తోంది. రైతులకు జీవనాధారమైన చెరువును కబ్జా చేయడంతో గ్రామస్తులు రైతులు ఆందోళన చెందుతున్నారు. లంకాల గ్రామ శివారులో 184 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఉర్వ చెరువును ఏకంగా 130ఎకరాలను కొందరు కబ్జా చేసి పొలాలు దున్నుతున్నారు. ఇందులో లంకాల మాజీ సర్పంచ్ చిన్నయ్య, బండ బలస్వామి చెరువులో 40 ఎకరాలను కబ్జా చేసి.. చదును చేస్తుండగా గ్రామంలో ఉన్న రైతులు యువకులు కలిసి మూకుమ్మడిగా పనులను అడ్డుకున్నారు. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్థులు.