లైంగిక దాడి కేసు: ఆశారాం బాపు కొడుకుకు జీవిత ఖైదు

లైంగిక దాడి కేసులో ఆధ్యాత్మిక వేత్త ఆశారం బాపు కొడుకు.. నారాయణ సాయికి జీవిత ఖైదు విధించింది సూరత్ హైకోర్టు. 2013లో సాయి లైంగిక దాడి చేసినట్టుగా అతని డివోర్టీ కేసు వేసింది. కేసును పరిశీలించిన న్యాయస్థానం సాయిని దోషిగా గుర్తించి.. శుక్రవారం జీవిత ఖైదును విధించింది. దీంతో పాటు.. లక్ష రూపాయల జరిమానాను వేసింది. ఇతని సహకరించిన.. గంగా, జమునా, హనుమాన్, మల్హోత్రాలకు 10 సంవత్సరాల జైలు శిక్ష తోపాటు.. 5000వేల రూపాయల జరిమానాను విధించింది.  ఈ కేసులో మొత్తం 11మంది నిందితులుగా పేర్కొనగా.. మిగిలిన ఆరుగురు నిర్దోషులని తేల్చి చెప్పింది కోర్టు. సాయి తండ్రి ఆశారాం బాపు కూడా లైంగిక దాడి కేసులో.. శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

Latest Updates