బీసీ హాస్టల్ లో.. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట బీసీ బాలుర వసతి గృహంలో.. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. రాత్రి భోజనంలో చికెన్ పెట్టారని చెబుతున్నారు విద్యార్థులు. తిన్నాక గంట సేపటి తర్వాత వాంతులు అయ్యాయని చెప్పారు. దీంతో పక్కనే ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లి చికిత్స పొందారు విద్యార్థులు.  తహశీల్ధార్ హాస్పిటల్ కు వచ్చి విద్యార్థుల ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ వార్డెన్ మాత్రం అర్థరాత్రి దాటిన తర్వాత కూడా హాస్పిటల్ కు రాలేదంటున్నారు విద్యార్థులు.

Latest Updates