2025 వరకు భారత్ ను టీబీ నుంచి విముక్తి చేస్తాం : మోడీ

2025 కల్లా భారత్ ను టీబీ నుంచి విముక్తి చేస్తామన్నారు ప్రధాని మోడీ. ఆదివారం వరల్డ్ టీబీ డే సందర్భంగా… ట్వీట్ చేశారు. 2030 నాటికి ప్రపంచం నుంచి టీబీని తరిమికొట్టాలని అన్ని దేశాలు టార్గెట్ పెట్టుకున్నాయి. అయితే ప్రపంచదేశాలు పెట్టుకున్న లక్ష్యం కంటే ఐదేళ్ల ముందుగానే భారత్ లో టీబీ లేకుండా చేస్తామన్నారు. టీబీ ఫ్రీ ఇండియా ప్రచారంతో పాటు, ఆయుష్మాన్ భారత్ ద్వారా టీబీ పేషెంట్లకు మెరుగైన వైద్యం అందిస్తామని, ఆరోగ్య ప్రమాణాలు పెంచుతామన్నారు. టీబీని సరైన సమయంలో గుర్తించి, పూర్తి చికిత్స తీసుకోవడంతో  నిర్మూలించవచ్చన్నారు మోడీ. దేశం నుంచి టీబీని తరిమికొట్టడానికి పని చేస్తున్న ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు.

Latest Updates