అంతరిక్షంలో 328 రోజులు గడిపి..భూమికి తిరిగొచ్చిన ఆస్ట్రోనాట్ క్రిస్టినా

అమెరికా ఆస్ట్రోనాట్ క్రిస్టినా కోచ్ భూమికి తిరిగొచ్చారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో 328 రోజులు ఉన్న ఆమె సింగిల్ మిషన్​లో ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడిపిన లేడీ ఆస్ట్రోనాట్​గా రికార్డుతో నేలకు దిగొచ్చారు. గురువారం ఉదయం 9:12 గంటలకు కజకిస్థాన్​లోని జెజ్​కజగాన్ సమీపంలోని పచ్చికబయళ్లలో ఆమెతో పాటు మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లను మోసుకొచ్చిన రష్యన్ సోయజ్ స్పేస్​క్రాఫ్ట్ పారాచూట్ సాయంతో సురక్షితంగా దిగిపోయింది. క్రిస్టినాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆస్ట్రోనాట్ లూకా పర్మిటానో, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ స్క్వోర్​త్సోవ్ కూడా సురక్షితంగా వచ్చారు. క్రిస్టినా కోచ్ గత ఏడాది మార్చి 14న ఐఎస్ఎస్​కు వెళ్లారు. ఆరు నెలలకే ఆమె తిరిగి రావాల్సి ఉండగా, నాసా మిషన్​ను పొడిగించింది. దీంతో నాసా ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్ 288 రోజులతో సింగిల్ స్పేస్​ఫ్లైట్​లో ఎక్కువ రోజులు స్పేస్​లో ఉన్న మహిళగా రికార్డ్ సాధించగా, కోచ్ దానిని గతేడాదే అధిగమించారు. కోచ్ తన 328 రోజుల మిషన్​లో ఆరు సార్లు ఐఎస్ఎస్ నుంచి బయటికి వచ్చి స్పేస్ వాక్ చేశారు. మొత్తం 42 గంటల 15 నిమిషాలు ఆమె ఐఎస్ఎస్ బయట ఉన్నారు. నాసా ఆస్ట్రోనాట్ జెస్సికా మీర్​తో కలిసి కోచ్ గత అక్టోబర్ 18న ఫస్ట్ ఆల్ ఫిమేల్ స్పేస్ వాక్ చేసి కూడా రికార్డ్ సృష్టించారు. ఐఎస్ఎస్​లో ఆమె ఇతర ఆస్ట్రోనాట్లతో కలిసి పలు ప్రయోగాలు, రీసెర్చ్​లలో కూడా పాల్గొన్నారు. వెన్నెముకను బలోపేతం చేయడం, ఎక్సర్ సైజ్, ప్రివెంటేటివ్ మెడిసిన్, కిడ్నీలపై స్పేస్ ట్రావెల్, మైక్రోగ్రావిటీ ప్రభావం, స్పేస్ లో డైట్, నీటి సంరక్షణ,  కూరగాయ మొక్కల పెరుగుదల, స్పేస్ లో మంటల వ్యాప్తి, ఎఫెక్ట్ ఎలా ఉంటుందన్న అంశాలపై రీసెర్చ్ చేశారు.

Latest Updates