నాసా కంటే ముందే.. చంద్రయాన్ ల్యాండర్ కనిపెట్టింది మనోడే!

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేయలేని పని మనోడు చేశాడు. చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్ జాడను కనిపెట్టాడు. చెన్సైకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ షణ్ముగ సుబ్రమణ్యం.. రెండు నెలలుగా నాసా శాస్త్రవేత్తలకు సాధ్యం కాని పని పూర్తి చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా నాసానే ప్రకటించింది.

ఇమేజ్‌పై ‘S’తో మార్క్ చేసి క్రెడిట్ ఇచ్చిన నాసా

చంద్రయాన్ -2 ల్యాండర్ విక్రమ్‌తో కమ్యూనికేషన్ మిస్ అయిన నాటి నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు దాని ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఆర్బిటర్ పంపిన ఫొటోల్లోనూ దాని జాడ తెలియలేదు. మరోవైపు నాసా కూడా విక్రమ్ కోసం ట్రై చేస్తూనే ఉంది. సెప్టెంబర్ 17, అక్టోబర్ 14, 15, నవంబర్ 11 తేదీల్లో విక్రమ్ మిస్ అయిన ప్రాంతాల్లో నాసా ఫొటోలు తీసింది. వాటిని మీడియాకు విడుదల చేయగా.. ప్రపంచంలో చాలా మంది సైంటిస్టులు వాటిని డౌన్ లోడ్ చేసుకుని అనలౌజ్ చేస్తున్నారు.

నాసా లూనార్ లూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ టీమ్ వాటిని డీకోడ్ చేసే ప్రయత్నాల్లో దిగింది. కానీ, ఏ ఫలితం లేకపోయింది. అయితే చెన్నైకు చెందిన షణ్ముగ సుబ్రమణ్యం దాన్ని క్రాక్ చేసి.. నాసాకు సమాచారం పంపారు. ల్యాండర్ పడిపోయిన చోట నుంచి 750 మీటర్ల దూరంలో కొన్ని ముక్కలును గుర్తించి మార్క్ చేశారు. ఆ తర్వాత ఆయన పంపిన కోడింగ్ బేస్‌గా మిగిలిన శకలాలను కూడా కనిపెట్టారు నాసా శాస్త్రవేత్తలు. విక్రమ్ పడిపోయిన చోట నుంచి కిలోమీటరు పైగా దూరంగా దాని ముక్కులు చెల్లాచెదురుగా పడినట్లు తెలిపింది. అయితే ఫస్ట్ ఈ ఘనత సాధించిన షణ్ముగకు క్రెడిట్ ఇస్తూ ఇవాళ నాసా రిలీజ్ చేసిన ఫొటోపై గ్రీన్ కలర్‌లో ఉన్న ముక్కలకు S’తో మార్క్ చేసింది.

మెకానికల్ ఇంజినీరింగ్ చదివి…

నాసా శాస్త్రవేత్తలు చేయలేని పనిని ముందుగా చేసి చూపిన షణ్ముగ సుబ్రమణ్యం స్వస్థలం తమిళనాడులోని మధురై. ఆయన మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ కోర్సు నేర్చుకుని కాగ్నిజెంట్‌ కంపెనీలో ప్రోగ్రాం అనలిస్ట్‌గా  చేరారు. ప్రస్తుతం చెన్నైలోని లెనాక్స్ ఇండియా టెక్నాలజీ సెంటర్‌ కంపెనీలో టెక్నికల్ ఆర్కిటెక్ట్‌గా వర్క్ చేస్తున్నారు.

ఓ భావోద్వేగం…

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం చంద్రయాన్-2. కేవలం రూ.970 కోట్లతో చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ల్యాండర్‌ను పంపించడమే టార్గెట్. జూలై 22న జరిగిన ఈ ప్రయోగం 90 శాతం విజయవతం అయింది. ఆర్బిటర్ సక్సెస్‌ఫుల్‌గా దాని లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తోంది.

MORE NEWS:

మా చివరి కోరిక తీర్చండి.. ఫ్యామిలీ అంతా సూసైడ్!

చలి కాలంలో పెరుగు తినకూడదా? ఆయుర్వేదం, సైన్స్ ఏం చెబుతున్నయ్?

కానీ, సెప్టెంబరు 7న మరికొద్ది నిమిషాల్లో సేఫ్‌గా చంద్రుడిపైకి ల్యాండర్ దిగుతుందనగా.. ఇస్రోతో కమ్యూనికేషన్ తెగిపోయింది. మరో కిలోమీటరు ప్రయాణిస్తే ల్యాండింగ్ అవుతుందనగా.. స్పీడ్‌గా చంద్రుడి ఉపరితలంపై క్రాష్ లాండ్ అయింది. దానితో సిగ్నల్ మళ్లీ కనెక్ట్ అవుతుందేమోనని, టెక్నికల్‌గా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసింది ఇస్రో. కానీ లాభం లేకపోయింది. యావద్దేశం మొత్తం ఎంతో గర్వంగా ఎదురుచూసిన సమయం చంద్రయాన్-2 ల్యాండింగ్. కానీ, ల్యాండింగ్ సమయంలో కమ్యూనికేషన్ తెగిపోవడంతో ఇస్రో చైర్మన్ శివన్ సహా చాలా మంది శాస్త్రవేత్తలు భావోద్వేగానికి లోనయ్యారు. శివన్ అయితే తమ బిడ్డను కోల్పోయినంతగా.. కంటతడి పెట్టుకున్నారు. ల్యాండింగ్‌ను ఇస్రో కంట్రోల్ రూమ్ నుంచి చూడడానికి వెళ్లి.. అక్కడే ఉన్న ప్రధాని మోడీ ఆయన్ని హత్తుకుని, ఓదార్చారు.

Latest Updates