నాసా సైంటిస్ట్ ల ప్రయోగం సక్సెస్ : అంతరిక్షంలో ముల్లంగి పంట

అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం  “నాసా” అంతరిక్షంలో ఇళ్ల ఏర్పాటుపై ప్రయోగాలు చేస్తుంది. ఆ ప్రయోగాలు చేయడం అంత ఈజీగా కాదు. ఎందుకంటే అక్కడ నివసించే ఆస్ట్రోనాట్స్ కు  ఇళ్లే కాదు…తినేందుకు ఆహారం అవసరం. నేల నుంచి డీహైడ్రేటెడ్ ప్యాకేజ్ భోజనం తీసుకొని వెళ్లడం శాశ్వత పరిష్కారం కాదు. అందుకే నాసా ప్రత్యేకంగా గురుత్వాకర్షణ శక్తి అతి తక్కువగా ఉండే అంతరిక్షంలో కూరగాయల సాగుపై దృష్టి పెట్టింది. విటమిన్లు, ఖనిజాలతో కూడిన మొక్కలను అంతరిక్షంలో తక్కువ సమయంలోనే కల్టివేట్ అవుతాయన్న ఉద్దేశంతో ముల్లంగిని ఎంచుకున్నారు. ఆ ప్రయోగం విజయవంతం అయినట్లు తెలుస్తోంది

గురుత్వాకర్షణ శక్తి అతి తక్కవ కాబట్టి ముల్లంగిని పెంచేందుకు దిండులా ఉండే బ్యాగుల్లో మట్టి, ఎరువులతో పాటు విత్తనాల్ని నాటారు. లైట్లు, మట్టి, సెన్సార్లను ఏర్పాటు చేశారు. నాసా కేంద్రమైన కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి వాటి పెరుగుదల పరీక్షిస్తున్నారు.

Latest Updates