మచ్చలేని సూరీడు

nasa-release-image-sun-without-spots

సన్‌‌ స్పాట్స్‌‌.. సూర్యుడి ఫోటోస్పియర్‌‌పై పక్కనున్న ప్రాంతాల కన్నా నల్లగా ఉండే ప్రాంతాలు.ఇక్కడి ఉష్ణోగ్రత సూర్యుడిపై మిగతా ప్రాంతాల కన్నా తక్కువగా ఉంటుంది. ఇటీవల నాసా విడుదల చేసిన సూర్యుని ఫొటోలో సన్‌‌ స్పాట్స్‌‌ అస్సలు లేవు. సూర్యుడు ‘సోలార్‌‌ మినిమమ్‌‌’ స్టేజ్‌‌కు వచ్చేశాడు. 16 రోజులుగా సూర్యుడు మచ్చలు లేకుండా కనబడుతున్నాడని స్పేస్‌‌ వెదర్‌‌ వెబ్‌‌సైట్‌‌ వెల్లడించింది. ఇలా ప్రతి 11 ఏళ్లకోసారి వస్తుంటుంది. సన్‌‌ స్పాట్స్‌‌ ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? అనుకోవద్దు. అవి లేకపోతే సూర్యుడి నుంచి విశ్వంలోకి భారీగా కాస్మిక్‌‌ కిరణాలు విడుదలవుతాయట. విశ్వంలో అయస్కాంత తుఫానులు వస్తాయంట. వాటి దెబ్బకు శాటిలైట్ల పనికి అంతరాయం కలుగుతుందట. విమాన ప్రయాణాలు కష్టమవుతాయట. పవర్‌‌ గ్రిడ్లూ పని చేయకుండా పోయే చాన్స్‌‌ ఉందట.

స్పేస్‌‌లోని ఆస్ట్రోనాట్స్‌‌కూ ఇబ్బంది తప్పదట. సూర్యుడు 1650, 1710ల్లో సోలార్‌‌ మినిమమ్‌‌లోకి వచ్చినప్పుడు భూమిపై అనేక ప్రాంతాలు ‘డీప్‌‌ ఫ్రీజ్‌‌’లోకి వెళ్లిపోయాయని నాసా చెప్పింది. సోలార్‌‌ మినిమమ్‌‌తో పాటు సోలార్‌‌ మాగ్జిమ్‌‌ అని కూడా ఒకటుంది. అంటే సూర్యునిపై మచ్చలు ఎక్కువగా కనబడతాయన్నమాట. ఈ మచ్చలు ఎంత పెద్దగా ఉంటాయో తెలుసా? గురు గ్రహమంత. మినిమమ్‌‌ నుంచి సూర్యుడు మాగ్జిమమ్‌‌లోకి వెళ్తున్నపుడు సూర్యుడి ఉపరితలంపై అల్లకల్లోలంగా ఉంటుందని నాసా పేర్కొంది. మరి కొన్నేళ్లల్లో ఇది సాధారణ విషయమైపోతుందని తెలిపింది.

Latest Updates