నాసా కొత్త  స్పేస్ సూట్‌‌

చందమామపై ఆస్ట్రోనాట్లు తేలిగ్గా తిరిగేందుకు వీలయ్యేలా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొత్త స్పేస్ సూట్లను తయారు చేస్తోంది. 2024లో ఆర్టిమిస్ మిషన్ ద్వారా మరోసారి ఆస్ట్రోనాట్లను చంద్రుడిపైకి పంపాలని నాసా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆస్ట్రోనాట్ల స్పేస్ సూట్లకు మరిన్ని టెక్నాలజీలను జోడిస్తోంది. ఈజీగా నడిచేందుకు, చేతులు తల వరకూ ఎత్తగలిగేందుకు వీలయ్యేలా డిజైన్ చేస్తోంది. ఆస్ట్రోనాట్లకు ఫుల్ బాడీ 3డీ స్కాన్ చేసి మరీ.. వారికి టైలర్ మేడ్ సూట్లను సిద్ధం చేస్తోంది. ఇక హెల్మెట్‌‌కు  పగుళ్లు ఏర్పడినా, అక్కడే రిపేర్ చేసుకునేలా తయారు చేస్తోంది. హెల్మెట్ మైక్రోఫోన్ డిజైన్‌‌నూ మార్చేసింది. ఎక్కువగా ఉక్కపోత లేకుండా చూసేందుకు, స్కిన్ ఇరిటేషన్ రాకుండా ఉండేందుకు కూడా కొత్త సూట్లలో మార్పులు చేస్తోంది.

Latest Updates