బావిలో పడిపోయిన బస్సు, ఆటో: 9 మంది మృతి

ప్రభుత్వ రవాణా బస్సు వేగంగా ఆటోను ఢీకొని, ఆ రెండూ రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయాయి. మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 9 మంది మరణించారు. 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

మంగళవారం సాయంత్రం మాలెగావ్ డియోలా రోడ్డుపై వెళ్తున్న బస్సు మెషీఫటా వద్ద వేగంగా ముందున్న ఆటోను ఢీకొట్టింది. ఈ సమయంలో రెండు వాహనాలు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయాయి. ఈ ఘటన జరిగిన తర్వాత స్థానికులు..  పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. బావిలో పడిన వాహనాలను అతి కష్టం మీద బయటకు లాగారు. తొమ్మిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొంత మంది కనిపించడం లేదు. వారి బావిలో పడిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే చాన్స్ ఉంది.

Latest Updates