దూసుకొస్తున్న ‘ఫణి’ : రేపటికల్లా తుఫానుగా మారే సూచన

విశాఖ : హిందూ మహాసముద్రం-ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీనికి ‘ఫణి’గా నామకరణం చేశారు. ఇవాళ సాయంత్రం సమయానికి చెన్నైకు ఆగ్నేయంగా 1,490 కి.మీ, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయదిశగా 1,760 కి.మీ దూరంలో ఈ వాయుగుండం కదులుతోంది. మరో 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా.. ఆ తర్వాత 12 గంటల్లో తుపానుగా మారే అవకాశముంది. దీంతో… తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇతర తీర ప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

Latest Updates