వివేక్ ఒబేరాయ్ కు నోటీసులిచ్చిన మహిళా కమీషన్

national-commission-for-women-notice-to-actor-vivek-oberoi

ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఐశ్వర్యరాయ్ ఫొటోను ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ఎగ్జిట్ పోల్స్, ఒపినియన్ పోల్స్, రిజల్ట్స్ అంటూ ఐశ్వర్య రాయ్ సల్మాన్ ఖాన్, వివేక్ ఒబేరాయ్, అభిషేక్ తో ఉన్న ఫొటోను పవన్ సింగ్ అనే అతను ట్వీట్ చేశాడు. దీంతో… పవన్ ట్వీట్ ను బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ రీ ట్వీట్ చేశాడు. సరదాగా ఉంది క్రియేటీవ్ గా ఉంది కానీ ఇలా చేయడం సరికాదంటూ వివేక్ తెలిపారు. ఈవిషయం పై నెటిజన్లు వివేక్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. బాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాలా, సోనమ్ కపూర్ ఈ ట్వీట్ చూసి వివేక్‌పై అసహనం వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయిన ఐశ్వర్యపై వివేక్ ఇలాంటి ట్వీట్ చేయడం సరికాదని అన్నారు. ఈ విషయాన్ని నేషనల్ కమీషన్ ఫర్ విమెన్ తీవ్రంగా పరిగనించింది. వివేక్ ఒబేరాయ్ తక్షణమే తన ట్వీట్ పై వివరణ ఇవ్వాలని కోరింది.

Latest Updates