ఎన్‌ఈపీ ప్రజల ఆశలకు నిలువుటద్దం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020పై ప్రధాని మోడీ స్పందించారు. ఇదో పాలసీ డాక్యుమెంట్ మాత్రమే కాదని.. 130 కోట్ల భారతీయుల కోరికలకు ఈ పాలసీ అద్దం పడుతుందన్నారు. శనివారం స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్ 2020 కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్త విద్యా విధానంపై పలు వ్యాఖ్యలు చేశారు.

‘21వ శతాబ్దం జ్ఞానానికి సంబంధించిన యుగం. లెర్నింగ్, ఇన్నోవేషన్, రీసెర్చ్‌పై మరింత ఫోకస్‌ చేయాల్సిన తరుణమిది. ఇదే ఇండియా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చేయనుంది. మనం ఇండియాలో క్వాలిటీ ఎడ్యుకేషన్‌పై దృష్టి పెట్టాం. మా చర్యల ద్వారా ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను మరింత అడ్వాన్స్‌గా, మోడర్న్‌గా స్టూడెంట్స్‌కు అందించాలనుకుంటున్నాం. ఈ కొత్త పాలసీ స్టూడెంట్స్‌ స్కూల్ బ్యాగుల్లో ఉన్న బర్డెన్‌ను జీవితంలో సాయపడే, క్రిటికల్ థింకింగ్‌ను అలవర్చే లెర్నింగ్‌కు బదిలీ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పాలసీతో దేశంలోని భాషలు మరింత ముందుకెళ్లడంతోపాటు అభివృద్ధి చెందుతాయి. ఇది కేవలం ఇండియా జ్ఞానాన్ని పెంచదు. కానీ ఇది మన ఐక్యతను పెంచుతుంది’ అని మోడీ పేర్కొన్నారు.

Latest Updates