దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై దర్యాప్తుకు ఆదేశించిన NHRC

దిశపై అత్యాచారం, హత్య చేసిన నిందితుల ఎన్ కౌంటర్ ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) దర్యాప్తుకు ఆదేశించింది. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించింది. తక్షణమే ఇన్వెస్టిగేషన్ టీంను, ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ ను స్పాట్ ఇన్వెస్టిగేషన్ చేయవలసిందిగా DGని ఆదేశించింది. దీంతో.. SSP టీం కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనుంది.  దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై నిజనిర్ధారణ జరగాలని పలువురు ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎనౌ కౌంటర్ పై పూర్తి వివరాలు అందజేయవలసిందిగా రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.

Latest Updates