సచ్చిపోతం.. పర్మిషన్ ఇవ్వండి

ఉద్యోగాలు భర్తీ చేస్తలేరని హెచ్చార్సీని ఆశ్రయించిన అభ్యర్థులు

నాంపల్లి(హైదరాబాద్), వెలుగు: కారుణ్య మరణాలకు పర్మిషన్ ఇవ్వాలంటూ కొంతమంది నిరుద్యోగులు సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. వైద్య, ఆరోగ్య, విద్యుత్ శాఖలలో 5,834  ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ 2017 లో నోటిఫికేషన్ ఇచ్చి, 2018లో పరీక్షలు జరిపిందని, కానీ ఇప్పటికీ ఫలితాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలకు హాజరైన 16 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తూ మానసిక వేదనకు గురవుతున్నారని హెచ్చార్సీకి వివరించారు. ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నా రు. ఉద్యోగాలు భర్తీ చేసేలా ఆదేశాలివ్వాలని, లేదా తమకు కారుణ్య మరణాలకైనా అనుమతించాలంటూ వేడుకున్నారు. దీనిపై హెచ్చార్సీ స్పందిస్తూ.. ఏప్రిల్ 26 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది.

Latest Updates