జాతీయ ఖో-ఖో జట్టు కెప్టెన్ కు తిండి కష్టాలు

భారత జాతీయ ఖో-ఖో జట్టు కెప్టెన్ నస్రీన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. లాక్డౌన్ కారణంగా రేషన్ కోసం కూడా కష్టపడుతున్నాడు. దాంతో తనకు సాయం చేయాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను నస్రీన్ కోరుతున్నాడు. దక్షిణాసియా క్రీడలలో గోల్డ్ మెడల్ సాధించిన నస్రీన్.. లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నస్రీన్ తండ్రి మొహమ్మద్ గఫూర్ వీధులలో స్టీల్ పాత్రలు అమ్మేవాడు. లాక్డౌన్ వల్ల ఇప్పుడు ఆమె తండ్రి వ్యాపారం ఆగిపోయింది. దాంతో వారికి కష్టాలు తప్పడం లేదు.

‘నా తండ్రి స్టీల్ గిన్నెలు అమ్మెవాడు. కరోనా వల్ల లాక్డౌన్ విధించారు. దాంతో ఆయన బయటకు వెళ్ళలేకపోతున్నాడు. దాంతో మా కుటుంబం ఆర్థిక కష్టాల్లో పడింది. నా తండ్రి సంపాదనే మా కుటుంబానికి దిక్కు. చివరికి రేషన్ పొందడంలో కూడా మాకు ఇబ్బందులు ఉన్నాయి. విషయం తెలిసి ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి త్యాగి మాకు సహాయం చేశారు. అయినా కూడా మా కష్లాలు తీరడంలేదు. అందుకే సీఎం కేజ్రీవాల్ ను సాయం చేయాలని కోరుతున్నాను. ఢిల్లీ ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించి సాయం చేస్తుందని నేను భావిస్తున్నాను. నేను ఖో ఖో జాతీయ జట్టుకు నాయకత్వం వహిస్తున్నందున ఢిల్లీ ప్రభుత్వం నుండి నాకు మద్ధతు లభిస్తుందని అనుకుంటున్నాను. కానీ.. ఢిల్లీ ప్రభుత్వం నా ట్వీట్లకు సమాధానం ఇవ్వడం లేదు. ఆ విషయం నాకు చాలా బాధ కలిగించింది. నా సమస్యలను సీఎం కేజ్రీవాల్ పరిశీలించాలని అభ్యర్థిస్తున్నాను’ అని నస్రీన్ అన్నారు.

For More News..

రైతుల కోసం ఉపవాస దీక్ష

పేదల కోసం రోటీ బ్యాంక్.. 11 రోజుల్లో లక్షకు పైగా చపాతీల పంపిణీ

చెన్నై రోడ్లపై కరోనా ఆటో..

హౌజింగ్ మినిష్టర్ కు కరోనా పాజిటివ్

Latest Updates