పెద్దమందడి, వెలుగు: వనపర్తి జిల్లా వాసి, పెద్దమందడి జడ్పీహెచ్ఎస్ స్కూల్ పీడీ మన్యం యాదవ్ జాతీయ స్థాయి హాకీ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యారు. ఈ నెల 17 నుంచి 28 వరకు న్యూఢిల్లీలో జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్లో తెలంగాణ జట్టుకు ఆయన నాయకత్వం వహించనున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గంగమ్మ, వనపర్తి జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొలమోని కుమార్, సెక్రటేరియట్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ నరేశ్, కోచ్ ఆనంద్, జిల్లా క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, హెచ్ఎం శాంతన్న అభినందించారు.
