ఢిల్లీలో కేసీఆర్​కు.. ‘దిశ’పై  మీడియా ప్రశ్నల వర్షం

న్యూఢిల్లీ, వెలుగు: ఒక్క రోజు పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన గులాబీ బాస్, సీఎం కేసీఆర్​కు ఊహించని పరిస్థితి ఎదురైంది. ‘దిశ’ ఘ‌‌ట‌‌న విష‌‌యంలో కేసీఆర్​పై నేషనల్ మీడియా నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. బాధితురాలి కుటుంబాన్ని ప‌‌రామ‌‌ర్శించ‌‌క‌‌పోవ‌‌డంపై ఢిల్లీ ఎయిర్‌‌పోర్టులో కేసీఆర్​ను ఓ జాతీయ చానెల్​ రిపోర్టర్​ ప్రశ్నించారు. పెళ్లిళ్లకు హాజ‌‌ర‌‌వుతున్నార‌‌ని, బాధితురాలి కుటుంబీకుల‌‌ను మాత్రం క‌‌ల‌‌వ‌‌రా అని అడిగారు.  ప్రైవేట్ ప్రొగ్రామ్‌‌లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ సోమ‌‌వారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయ‌‌న‌‌ ఢిల్లీ ఎయిర్‌‌పోర్టులో దిగ‌‌గానే జాతీయ మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు సంధించారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా కాన్వాయ్‌‌ లో వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం సీఎం కేసీఆర్ పంటి డాక్టర్​ను కలిసినట్టు తెలిసింది. సాయంత్రం దౌలకువాలో జరిగిన పెళ్లి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు.

national media Questions to KCR over Disha case

Latest Updates