రూ.7లక్షల విలువైన కుంకుమ పువ్వును పట్టుకున్న పోలీసులు

తమిళనాడు: పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు దొంగలు అనేక టెక్నిక్ లు ఉపయోగిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా తరలించేవారు ఇప్పటివరకు వాడని టెక్నిక్ తో స్మగ్లరు గోల్డ్ ను తరలించాలనుకున్నారు. కానీ పోలీసులకు చిక్కారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని, విలువైన కుంకుమపువ్వును కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

ఈ ఘటన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. నడుముకు చుట్టుకున్న బ్యాండ్‌లో నిందితులు 1.8 కేజీల బంగారాన్ని తరలిస్తున్నారు. దీని విలువ రూ. 71.5 లక్షలుగా సమాచారం. అదేవిధంగా 26.5 కేజీల ఇరానీ కుంకుమపువ్వును అధికారులు గుర్తించి పట్టుకున్నారు. దీని విలువ రూ. 63.6 లక్షలుగా సమాచారం. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

 

Latest Updates