19న దేశవ్యాప్తంగా లారీల సమ్మె

కేంద్రం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన మోటార్ వెహికిల్స్ చట్టంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా లారీ యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారీగా చలానాలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహించేందుకు రెడీ అయ్యారు.

ఈనెల 19న ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు లారీల సమ్మె కొనసాగనుంది. దేశవ్యాప్త లారీల సమ్మెకు ఆల్ ఇండియా మోటర్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ సమ్మెకు పిలుపునిచ్చింది. తమిళనాడు ఫుడ్, ఆయిల్ అండ్ ట్యాంకర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా ఈ సమ్మెకు మద్దతు తెలిపింది.

ఈనెల 1వతేదీ నుంచి కేంద్రం కొత్తగా మోటర్ వెహికల్స్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై భారీగా ఫైన్ లు విధిస్తున్నారు అధికారులు.

Latest Updates